జనం న్యూస్ డిసెంబర్ 12 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం
రామచంద్రపురం ఎల్‌ఐజీలోని విద్యా భారత్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఎల్ఐజీ సంఘ అధ్యక్షుడు యాదగిరి, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు గాలి రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, మానసిక ఉల్లాసం మెరుగుపడుతుందని, ప్రతి విద్యార్థి రోజూ క్రీడలకు ప్రత్యేక సమయం కేటాయించాలన్నారు.కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, ప్రపంచంతో పోటీపడగల సామర్థ్యం దేశ విద్యార్థుల్లో పెంపొందేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల కేంద్ర కేబినెట్ దేశ క్రీడల పురోగతికి సంబంధించి జాతీయ క్రీడా విధానానికి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని అగ్ర ఐదు దేశాల్లో నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.


