Listen to this article

ప్రయాణికులకు అవగాహన కల్పించిన.ఎస్సై మోహన్ రెడ్డి

బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం. బిచ్కుంద బస్ స్టాప్ నందు ఉన్న ప్రయాణికులు అందరికీ మరియు బ్యాంకు వద్ద నుండి నగదు విత్ డ్రా చేసుకొని పోతున్న ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్య సూచన ఏమనగా చుట్టుపక్కల ఉన్న పట్టణ పరిసర ప్రాంతాలలో అటెన్షన్ డైవర్షన్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కావున ప్రయాణికులు అందరూ బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి చిన్నపిల్లలు ఆడవాళ్లను అందర్నీ గమనిస్తూ మీ ప్రయాణం సాగించండి బ్యాంకు నుండి నగదు తీసుకెళ్లేవారు చాలా జాగ్రత్తలు పాటిస్తూ అత్యాశకు వెళ్లకుండా మీ డబ్బులను మీరు జాగ్రత్తగా తీసుకెళ్లాలి దొంగలు మీ డబ్బును బంగారంను కాజేయడం కోసం వారి దగ్గర కొంత అమౌంట్ కింద పడవేసి ఇది మీ డబ్బు అని మీకు తెలియజేసి మీ వద్ద ఉన్న నగదును బంగారంను దొంగలిస్తారు మీ నగదును మీ బైక్ డిక్కీలో పెట్టుకున్నచో దొంగలు మిమ్మల్ని బైక్ నుండి మీ మనసు మళ్లింప చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకొని పోతున్నారు కావున ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులు ను అనుమానితులు ఎవరైనా కనిపించిన చౌ పోలీసువారికి వెంటనే సమాచారం ఇవ్వగలరని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు .