Listen to this article

ఎస్సై మోహన్ రెడ్డి

బిచ్కుంద డిసెంబర్ 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల ప్రజలందరికీ పోలీసువారి ముఖ్య సూచనలు ఏమనగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులందరూ మరియు ప్రజలందరూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసు వారికి సహకరించగలరని కోరుతున్నాము. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎవరు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించరాదని ఉల్లంఘించు వారిపైన కఠిన చర్యలు తీసుకోబడును .అవాంఛనీయ సంఘటనలు గొడవలు ఏమి జరగకుండా ప్రజలందరూ సామరస్యపూర్వకంగా స్నేహ భావంతో ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును అందరూ వినియోగించుకొని తనకు నచ్చిన అభ్యర్థులకి ఓటు వేసుకోవాలని కోరుతున్నాము. ఓటు వేసే ఓటర్లు పోలింగ్ బూత్ లోకి లోపలికి మొబైల్ ఫోన్స్ ,కెమెరాస్ ,బ్యాగ్స్ ,మ్యాచ్ బాక్స్ ,ఇంక్ పెన్సిల్ లాంటివి తీసుకెళ్లకూడదు అని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు