జనం న్యూస్ డిసెంబర్ 13 ముమ్మిడివరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వాడపల్లి దేవస్థానం పాలక మండలి సభ్యులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు తమ్మన సాయి ప్రసాద్ ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం ని వారి స్వగృహంలో లో మర్యాద పూర్వకంగా కలిశారు. వారిని సత్యనందం శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య నాయకులు శ్రీగ్రాకోలాపు బాబీ శ్రీగ్రాకోలాపు గోపాల కృష్ణ , గమిడి ఆనంద్ , ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి , పాలూరి జయ ప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.



