Listen to this article

జనం న్యూస్‌ 15 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం పట్టణంలో డిసెంబర్ 14న ముందుగా గుర్తించిన 80 ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. డిఎస్పీల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రంగా లేని వాహనాలను సీజ్ చేయడం, హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేసామన్నారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు 80 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో 4 డిఎస్పీలు, 12మంది సిఐలు, 33 మంది ఎస్ఐలతో సహా సుమారు 350మంది సిబ్బందిని వినియోగించామన్నారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా ఉన్నవి, లేనిది గుర్తించి, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సైలన్సర్లను మార్పులు చేసి, శబ్ద కాలుష్యంకు కారణమవు తున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో ప్రజలకు రహదారి భద్రత పట్ల కూడా అవగాహన కల్పించి, హెల్మెట్ ధారణ ఎంత ప్రయోజనకరమో వాహనదారులకు వివరించామన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 50మందికి జైలుశిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదాలు జరగకుండా లైన్ డిపార్టుమెంట్స్ సహకారంతో రహదారుల ప్రక్కన ఉన్న మొక్క లను తొలగిస్తున్నామని, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారులను గుర్తించి, ఆయా డిపార్టుమెంట్స్ దృష్టికి తీసుకొని వెళ్ళి, మరమ్మత్తులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు గోల్డెన్ అవర్లో తీసుకొని వెళ్ళినట్లయితే, వారిని ప్రభుత్వం గుర్తించి, రూ. 5వేలు నగదును ప్రోత్సాహకంగా అందిస్తుందని, వారిపై ఎటువంటి వేధింపులు ఉండవని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేసారు. అదే విధంగా విజయనగరం మీదుగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు సహా సుమారు 400 మంది సిబ్బంది పాల్గొన్నారు.