Listen to this article

జనం న్యూస్ 15 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతుతో గెలిచిన ఆరగిద్ద గ్రామానికి చెందిన నూతన గ్రామ సర్పంచ్ బాలక్రిష్ణ నాయుడు కు జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ నూతన గ్రామ సర్పంచ్ కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, నాయకులు నర్సింహులు,హనుమంతు,మల్దకల్,ఈరన్న తదితరులు పాల్గొన్నారు.