సర్పంచ్ కుమారుడి నామకరణ మహోత్సవంలో పాల్గొన్న సుగుణక్క
జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్: జైనూర్ మండలం జెండగూడ గ్రామపంచాయతీలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తాగునీరు, రోడ్లు, విద్యుత్,ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన జెండగూడ సర్పంచ్ ఉయిక పూనమ్ చందన్షావ్,రాసిమెట్ట సర్పంచ్ ఉయిక చందు,భూసి మెట్ట సర్పంచ్ దుర్వ సింధు-నాగేష్, సిర్పూర్ (యు) మండలం ధన్నూర్- బి సర్పంచ్ మెస్రం స్పందన లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.సుగుణక్క మాట్లాడుతూ..గ్రామాభివృద్ధి కోసం ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని సుగుణక్క భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పని చేస్తుందని, గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం అల్లిగూడ–జెండగూడ నూతన సర్పంచ్ ఉయిక పూనమ్ చందన్షావ్ కుమారుడి నామకరణ మహోత్సవం కార్యక్రమంలో సుగుణక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌కు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముఖిద్, మార్కెట్ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్,సుద్దాల శ్రీనివాస్,ప్రకాష్,మహేష్,సిద్దు,కోటేష్, దత్తు,హైదర్,విక్రమ్,గ్రామ పటేల్ మెస్రం భీమ్ రావ్, మెస్రం పాలక్ రావ్,ఉయిక చిత్రు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


