Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

అన్నమయ్య ఉమ్మడి జిల్లా లలో సోమశిల ముంపునకు, గురైన 54 గ్రామాలకు చెందిన కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్రయోజనాలు ఎక్స్రేసియా పంపిణీ కోసం చర్యలు చేపట్టినట్లు నందలూరు మండల తాసిల్దార్ అమరేశ్వరి మీడియాకు తెలిపారు, ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన డబ్ల్యు పి నంబర్ 119 / 2022 వచ్చిన ఆదేశాల మేరకు ముంపు గ్రామాల అవార్డు దారులను గుర్తించి రికార్డుల పరిశీలన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ముంపు గ్రామాలైన,పోత్తపి,కొమ్మూరు,కోనాపురం,తిమ్మరాజుపల్లి ,కిచ్చంపేట,తాళ్లవరం,చాపలవారిపల్లి, కొత్తపల్లి తిమ్మరాజు పల్లి, రామంభపురం, రంగాయపేట,వెంకట రాజంపేట,మజార కోనాపురం ఎగువ రాచపల్లి, తదితర ముంపు గ్రామాలకు గ్రామాలకు రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లు గ్రామ రెవెన్యూ సహాయకులు తో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడు తున్నాయని అర్హులైన అవార్డుదారులు ఆధార్ కార్డు నకలు, అవార్డు కాపీ నకలు, బ్యాంకు పాస్ పుస్తకము నకలు, రేషన్ కార్డు వంటి పత్రాలతో ఆయా ప్రాంత సచివాలయాల లో కానీ మండల కార్యాలయం నందు కానీ సమర్పించాలని తాసిల్దార్ తెలిపారు అర్హులైన వారు 16వ తేదీన నూకి నేనిపల్లి గ్రామ సచివాలయం పోత్తపీ, కొమ్మూరు కోనాపురం తిమ్మరాజు పల్లి సంబంధించి నల్ల దిమ్మాయిపల్లి గ్రామ సచివాలయం నందు, కిచ్చంపేట సంబంధించిన వారు కొత్తపీ పంచాయతీ భవనం నందు, సంప్రదించ వలెను అలాగే 17వ తేదీన మరియు 18వ తేదీన చేపలవారిపల్లి కొత్తపల్లి వెంకట రాజంపేట మధిర తిమ్మరాజు పల్లి రామాంజనేయ పురం జంగాలపల్లి రంగాయపల్లి వెంకట రాజంపేట మధిర కోనాపురం ఎగువ రాచపల్లి తర్వాత దీనికి సంబంధించిన నందలూరు తాసిల్దార్ కార్యాలయంలో 16 17 18 తేదీలలో అవార్డు దారులు తాసిల్దార్ కార్యాలయము నందు సంప్రదించవలెన అని మండల తాసిల్దారు అమరేశ్వరి కోరారు ప్రతి ముంపు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని కోర్టు ఆదేశాల అమలులో ఎలాంటి జాప్యం ఉండదని మండల తాసిల్దార్ అమరేశ్వరి తెలిపారు,