Listen to this article

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్య లయ్యా రన్నారు. ప్రైవేట్ కి, ప్రభుత్వ వైద్య కళాశాలల మధ్య తేడాలను కూటమి నేతలు గుర్తించాలన్నారు.వైద్య, విద్య పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ విమానాశ్రయంతో వైద్య, విద్యను పోల్చడం సరికాదన్నారు. అలాంటి వ్యాఖ్యలు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన మంత్రి నోటి వెంట వస్తాయని ఊహించలేదని చెప్పారు. వైద్య, విద్యా రంగాలను ప్రభుత్వమే నిర్వహిస్తేనే పేద వాళ్లకి మంచి జరుగుతుందని చెప్పారు.