Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండల కేంద్రంలోని సర్పంచ్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుసుమ రమాదేవి శరత్ సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బసాని శాంతకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన వలపదాసు రమ చంద్రమౌళి భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థిలు బసాని శాంత కేసపోర్ట్ చేస్తుండడంతో శాంత విజయం దిశగా పరుగులు తీస్తుందని తెలిపారు. అనంతరం కుసుమ రమా శరత్ మాట్లాడుతూ పద్మశాలి సంఘ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకుల సూచనల మేరకు బసాని శాంత గెలుపు కొరకు పూర్తి మద్దతు తెలియజేస్తూ తమ సహాయ సహకారాలు గెలుపు కొరకు అందజేస్తామని తెలిపారు. బసాని శాంత గెలుపునకు తను పోటీ నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బసాని శాంత బ్యాట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కుసుమా రమాదేవి శరత్, వలపదాసు రమా చంద్రమౌళి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి బసాని శాంతా రవి, పద్మశాలి నాయకులు దిడ్డి రమేష్, మాజీ కార్పొరేటర్ బసాని శ్రీనివాస్, భాషని ప్రకాష్, వంగరి సాంబయ్య, మామిడి మారుతి, రంగు మహేందర్, చిందం రవి, గొట్టిముక్కల రమేష్, బూర లక్ష్మీనారాయణ, బసాని రాజు, దిడ్డి ప్రభాకర్, బసాని వెంకటపతి, వడ్డేపల్లి శ్రీనివాస్, వనం దేవరాజు, పద్మశాలి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..