జనం న్యూస్ 16 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగర తిరుమల మెడికవర్ హాస్పిటల్ నందు ఈరోజు కిడ్నీ ట్రాన్సప్లంట్ కార్యక్రమం నందు అన్ని దానాల కన్నా అవయవ దానం ఎంతో మహోన్నతమైనదని,అవయవ దానం చేస్తే 8 మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల,ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానికతిరుమలమెడికవర్ఆసుపత్రిలో సోమవారం అవయవదాతల అభినందన సభ మరియు అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి అవయవ దానం చేసిన వారిని సత్కరించారు.ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవయవదానంపై అవగాహన పెరగడం శుభ పరిణామం అన్నారు.ఏపీ జీవన్ ధార్ విమ్స్ అండ్ సిటిసి డైరెక్టర్ డాక్టర్ కే.రాంబాబు మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల క్రితం రక్తదానమే ఎంతో ప్రమాదకరంగా భావించే వారిని, నేటి సమాజంలో రక్తదానం చేసే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, అదేవిధంగా అవయవదానంపై కూడా ప్రజల్లో అవగాహన పెరగాలని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను బుగ్గిపాలు, బూడిద పాలు చేయకుండా అవయవాలను అవయవ దానం చేస్తే మరో 8 మంది ప్రాణాలను కాపాడి మరణించిన జీవించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 5 వేల మంది జీవన్‌దాన్ లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.వీరిలో సగానికి పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఉన్నారని తెలిపారు. భారతదేశంలో అవయవ దానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని,అవయవ దానంపై అపోహలను వీడి ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా అవయవ ధనంతో పాటు దేహదానం కూడా చేయవచ్చని, దేహదానం చేస్తే ఎంతోమంది వైద్యులకు విద్యను నేర్పించిన వారు అవుతారని అభిప్రాయపడ్డారు. ప్రజలు మూఢనమ్మకాలను వీడి దేహదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల మెడికవర్ హాస్పిటల్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా చరిత్రలో మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మెడికల్ ఆసుపత్రిలో చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆ రోగి ఆరోగ్యం కుదుటపడి కోలుకుంటున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జగదీష్, డాక్టర్ సూర్య నిహార్, డాక్టర్ సుధీర్ నాయుడు, డాక్టర్ అశోక్, తిరుమల మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


