న్యూస్ డిసెంబర్ 16 ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ ఏలూరి.
మార్కాపురం.
సోమవారం ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలకు బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు ఈ బస్సు యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించారని అన్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం ఈ యాత్రపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వకారణమని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు. దేశ నిర్మాణంలో అటల్ జీ చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధి, సుపరిపాలనకు ఆయన చూపిన మార్గదర్శకత్వం నేటి,రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.అటల్ బిహారీ వాజపేయి ఆశయాలను, అభివృద్ధి దృక్పథాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మరింత ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలుపుతున్నారని చెప్పారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుపరిపాలన, అభివృద్ధి, జాతీయత అనే అంశాలను ప్రజలకు మరింత దగ్గర చేయగలిగామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా అటల్–మోదీ ఆలోచనలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు సంసిద్ధులై ఉన్నారని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.


