Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక అనకాపల్లి నియోజకవర్గ ప్రజల నుండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలను శ్రద్ధగా విన్న మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.//