జనం కోసం 16 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఉపసర్పంచ్ లను మరియు వార్డు సభ్యులను సన్మానించి నమహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ గారు ,బిజెపి జిల్లా యువనాయకురాలు మరియు డీకే స్నిగ్ద రెడ్డి దరూర్ మండలం నుండి నిలహళ్లి గ్రామ సర్పంచ్ . రంగ రెడ్డి, చిన్న చింత రేవుల సర్పంచ్ రాజేష్ అయ్యా, కాపుల కుంట గ్రామ సర్పంచ్ జయమ్మ శేఖర్ రెడ్డి, నర్సన్ దొడ్డి గ్రామ సర్పంచ్ పర్ణిక రెడ్డి, మన్నా పురం యువరాజ్, కెటి దొడ్డి మండలంలోని పాగుంట గ్రామ సర్పంచ్ అంజనప్ప, ఈర్ల బండ గ్రామ సర్పంచ్ గౌళ్ల సువర్ణమ్మ, సన్మానించడం జరిగింది.
మొదటి విడతలో గెలుపొందిన అభ్యర్థులను బిజెపి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ బిజెపి జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డికె. అరుణమ్మ మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత జనంలోకి తీసుకువెళ్లాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు ఎంపీ డీకే అరుణమ్మ సూచనలు చేశారు.గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వా నిధులతోనని అన్నారు..గ్రామంలో జరిగే అభివృద్ధి పనులకు నిధులు కేంద్రం అందజేస్తుందని ప్రజలకు వివరించాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి ఎన్ని నిధులు అందజేస్తుందనే సమాచారం తెలుసుకొని.. ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలందరి పై ఉందని అన్నారు.నిజాయితీగా, నిబద్దతతో పని చేయాలని, నిరంతరం గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవికుమార్ ఎక్బోటే,శ్యామ్ రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బండల వెంకట రాములు, అక్కల రమా దేవి,జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్ర రెడ్డి జిల్లా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, పెద్ద ఎత్తున బిజెపి నాయకులు హాజరయ్యారు..


