Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు: అయ్యప్ప స్వామి శబరిమలై దర్శనార్థం ఏనుగుల బాలాంజనేయులు (గురుస్వామి)ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శబరి యాత్రకు ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా సుమారు 120 మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలైకి ప్రయాణమయ్యారు. దీక్షతో, భక్తిశ్రద్ధలతో “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాల మధ్య భక్తులు శబరి యాత్రకు బయలుదేరారు.ఈ శబరి యాత్రలో భాగంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం నందలూరు రైల్వే స్టేషన్‌లో జయంతి కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైలును నిలుపుదల చేయించడంలో అన్నమయ్య జిల్లా బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ కీలక పాత్ర పోషించారు. భక్తుల విజ్ఞప్తికి స్పందించి రైల్వే అధికారులతో సమన్వయం చేసి స్టేషన్ నిలుపుదల కల్పించినందుకు అయ్యప్ప స్వామి భక్తులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నందలూరు రైల్వే స్టేషన్‌లో భక్తులు సాయి లోకేష్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్ప గుచ్ఛాలు అందజేశారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు సజావుగా సాగుతాయని భక్తులు తెలిపారు.అదే విధంగా శబరి యాత్ర విజయవంతంగా నిర్వ హించేందుకు సహకరించిన రైల్వే అధికారులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు మరియు మీడియాకు కూడా భక్తులు ధన్యవాదాలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ శబరి యాత్ర నిర్ఘాటంగా,సురక్షితంగా పూర్తవ్వాలని, యాత్రలో పాల్గొన్న ప్రతి భక్తుడికి స్వామి కృప లభించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మొగరాజు రమణయ్య ,జిల్లా కార్యదర్శి నాగేంద్రరాజు,మాజీ మండల అధ్యక్షుడు ఆండ్ర శివారెడ్డి,రాచూరిమురళి,వీరబల్లి జయకుమార్‌ రెడ్డి,తోట శివశంకర్,శ్రీరామ్ కిరణ్ రాజేష్,వెంకటమస్తాన్,మమ్ముడిసుధాకర్,బోయ మోహన్,కల్లూరి సుబ్బరాయుడు బోయ రాము,దియ్యాల రాము, గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు,