Listen to this article

స్థానిక ఎన్నికల నేపథ్యంలో భీమనపల్లి గ్రామం పోలీస్ వారి పహారులో ఉంది. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది.ఈరోజు నుండి రేపు అనగా తేదీ 17-12-2025 సాయంత్రం 10 గంటల వరకు భీమనపల్లి గ్రామంలో పోలీస్ వారి పహారా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో గ్రామ ప్రజలంతా పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో గుంపులుగా చేరి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా, ఎలాంటి ఇబ్బందులు, గొడవలు, మాంసనే సంఘటనలు లేదా అపార్థాలు జరగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా శాంతి భద్రతలను కాపాడటం మనందరి సామూహిక బాధ్యత అని తెలిపారు.ప్రజల సహకారంతో భీమనపల్లికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి, శాంతియుత ఎన్నికలకు ఆదర్శంగా నిలవాలని పోలీస్ శాఖ ఆకాంక్షిస్తోంది.శాంతి, ఐక్యత, సహకారంతో భీమనపల్లి గ్రామం ముందుకు సాగాలని కోరుకుందాం.