జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మామిడికుదురు మండలం బి.దొడ్డవరానికి చెందిన పసుపులేటి మహాలక్ష్మిరావు నియమితులయ్యారు.
ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో ఓబీసీ మోర్చా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని మహాలక్ష్మిరావు ఈ సందర్భంగా తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారికి , జిల్లా కోర్ కమిటీ సభ్యులందరికీ, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ వారికి, సోము వీర్రాజు వారికి, రాష్ట్ర సంఘటనా మంత్రివర్యులు నూకల మధుకర్ వారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు నాపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని మనస్ఫూర్తిగాతెలియజేస్తున్నాను. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలి యజేస్తున్నాను.


