జనం న్యూస్ డిసెంబర్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట.
మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నమ్మకద్రోహం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు శాయంపేట మండల కేంద్రానికి చెందిన వలపదాసు చంద్రమౌళి కుసుమ శరత్ బాబులను బీ ఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము అని , నేడు పార్టీ అధిష్టానం ఆదేశానుసారంగా ఈ నిర్ణయం తీసుకున్నాము అని బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి మెతుకు తిరుపతి రెడ్డి , గాజే రాజేందర్, కరణ్ బాబు, మండల బీ ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, మాజీ ఉప సర్పంచ్ సుమన్,పోడిశెట్టి గణేష్,ప్రభాకర్,రంగు మహేందర్,చంద్రమొగిలి తెలిపారు…


