Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి

ముమ్మిడివరం.. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గుత్తుల సాయి పేరును అధిష్టానం ఖరారుచేసింది. ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామానికి చెందిన ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గాడిలంక సర్పంచ్ గాను, 2000 లో ముమ్మిడివరం ఎంపీపీగా, 2005 లో పి గన్నవరం జడ్పిటిసిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆసమయంలో జెడ్పీ ఛైర్మన్ పదవి అందినట్లే అంది చేజారింది. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి బంగ పడడంతో స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసి 33 వేలకు పైగా ఓట్లు సాధించారు. 2014 . అనంతరం టిడిపిలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అన్ని సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగిన సాయికి జిల్లా అధ్యక్షుడు పదవి వరించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన్ను అధ్యక్షుడుగా నియమించడంలో కోనసీమ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి పూర్తి మద్దతు ప్రకటించడంతో ఆయన నియామకం సులభమైంది.