జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి ప్రాంతంలో దేవాలయాల్లో ఉన్న ప్రదేశాలు రాత్రిపూట చీకటిలో ఉన్నందున దేవాలయంలో రాత్రి సమయములో పూజలు నిర్వహించినప్పుడు లైటింగ్ లేక భక్తులు ఇబ్బందులు పడుతున్న దృశ్య ఇటీవల నియమితులైన దేవస్థానం చైర్మన్ లు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణకు ఈరోజు ఉదయం జనసేన కార్యాలయంలో కలుసుకొని భక్తులు ఇబ్బందులను రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చి చర్చించిన పిదప ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా చైర్మన్లు కోరిన వెంటనే జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు సదర వినతి పత్రంపై ఎండార్స్మెంట్ రాసి కమిషనర్ కి అందజేశారని శ్రీ భోగ లింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. గవరపాలెం ముఖద్వారం అగ్గిమరిచెట్టు వీధితో కలుపుకొని మొత్తం 8 ప్రాంతాల్లో ఐమాక్స్ రైటింగ్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కమిషనర్ కు శాసనసభ్యులు రామకృష్ణ సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో దేవుని గుమ్మంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బొలిశెట్టి శ్రీనివాసరావు శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి హేమగిరి సత్యనారాయణ స్వామి దేవస్థానం అప్పికొండ గణేష్ శ్రీ సంతోషిమాత దేవస్థాన చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.//


