Listen to this article

షాలువాతో సన్మానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.

జనం న్యూస్ 17డిసెంబర్. కొమురం భీమ్. జిల్లా స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్: జైనూర్ మండలం ఉషగాం గ్రామపంచాయతీ సర్పంచ్ ఆత్రం శేషారావు, ఉప సర్పంచ్ సోయం సూర్యభాన్ బుధవారం సుగుణక్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి, శాలువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.పంచాయితీ ఎన్నికల అనంతరం తొలిసారిగా క్యాంపు కార్యాలయానికి వచ్చిన జైనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ముఖిద్, నార్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లోకండే దేవురావులను కూడా సుగుణక్క శాలువాలతో సన్మానించారు. అలాగే పంచాయితీ ఎన్నికల్లో పార్టీ కోసం చురుకుగా పనిచేసిన ఉషగాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెందూర్ నర్సిములు, సోయం మాధవరావు, కనక రమేష్, కోవ సిద్ధు తదితరులను అభినందించారు. ప్రజాస్వామ్య విలువలు, సంక్షేమ పాలన కోసం కొత్తగా పార్టీలో చేరిన నాయకులు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.డీసీసీ కార్యాలయం, కుమురంభీమ్ ఆసిఫాబాద్