Listen to this article

జనం న్యూస్ 17 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఉగ్ర నిరసన! మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది గాంధీ ఆశయాలకు, దేశ ప్రజలకు చేసిన ఘోర అవమానమని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి తీవ్రంగా ధ్వజమెత్తారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతిపక్ష నేత గౌరవ రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు, ఈరోజు అరకు వేలి నియోజకవర్గం, అరకు వెల్లి మండల కేంద్రంలోని గిరిజన మ్యూజియం సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాంత కుమారి మాట్లాడుతూ,2005లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గిరిజనులు, పేదలు, కూలీల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, ఆత్మగౌరవం కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం పేరు మార్చే కుట్రకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు పేరు మార్పుతో ఎవరికీ లాభం లేదు… ప్రజలకే నష్టం! ఇరవై సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ పేరుతో అమలవుతున్న పథకాన్ని మార్చడం ద్వారా ప్రజాధనాన్ని వృథా చేయడమేనని, ఇది దేశానికి త్యాగం చేసిన మహాత్మా గాంధీ అవమానపరిచినట్టేనని అన్నారు దేశం కోసం పోరాటం చేయని బీజేపీ నాయకులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ పేరును తొలగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పార్లమెంట్లో వెంటనే ఈ పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెల్ల గంజి సోమేశ్వరరావు,కిషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుపాంగిగంగాధర్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడుకన్నూరి ప్రవీణ్. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రేమ్ కుమార్,సీనియర్ నాయకులు పి. చిన్నస్వామి, కిల్లో జగనాదం, పి. మాలతి, జి. జ్ఞానసుందరి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు