Listen to this article

టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి మద్దతు పొందిన శ్రీనివాసరెడ్డి విజయం ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలను తన ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లిన శ్రీనివాసరెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా అభినందించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తెలిపారు.