ప్రవేట్ స్కూల్ బస్సులు ఎన్నికల విధులకు వినియోగించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం
జనం న్యూస్ -డిసెంబర్ 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ –
పంచాయితీ ఎన్నికలు పురస్కరించుకుని నాగార్జునసాగర్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందిని, ఎన్నికల సామాగ్రిని తరలించడానికి ప్రైవేట్ పాఠశాలల బస్సులు వినియోగించడంతో నాగార్జునసాగర్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించాయి, నాగార్జునసాగర్ టౌన్ పరిధిలోని ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా నడుస్తుండగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రమే సెలవులు ప్రకటించడంతో సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయితీ ఎన్నికలకు పాఠశాల బస్సులు వినియోగించడంపై సామాజిక కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోగా దేవరకొండ డివిజన్ పరిధిలో, మరియు కొన్ని ప్రాంతాలలో నిర్వహిస్తున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా, పంచాయతీ ఎన్నికలు లేని నాగార్జునసాగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రవేట్ పాఠశాల బస్సులు ఎన్నికల విధులకు వినియోగించడం సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


