Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు ఈనెల 21న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు బుధవారం మధ్యాహ్నం బూత్ లెవెల్ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమం లో వైద్యాధికారి మాట్లాడుతూ మండలం లో5సంవత్సరాలు లోపు పిల్లలు 4300 ఉన్నారు. వారందరికీ పోలియో చుక్కలు వేయించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలం లో 48 పోలియో కేంద్రాలను మరియు రైల్వే స్టేషన్, బస్టాండులో కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కావున మన బాధ్యతగా ప్రతి ఒక్క ఉద్యగి భాగస్వామి అయి ప్రజలకు అవగాహన కల్పించి ఈ పల్స్ పోలియో కార్యక్రమం లో5సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించినందలూరు మండలాన్ని పోలియో రహిత మండలంగా చేయాలని కోరిరి.ఈ సమావేశానికి మండల తాసిల్దార్ అమరేశ్వరి, మండల అభివృద్ధి అధికారి కె.ర్. ఎం. ప్రసాద్, మండల విద్యా శాఖాధికారి అనంతకృష్ణ, ఐ. సి.డి.ఎస్ సూపర్వైసర్ శ్రీమతి సునీతమ్మ,సి.హెచ్.ఓవెంకటనారాయణ,పి. హెచ్. న్ శైలజ, సూపర్వైసర్ సునీల్, హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి మరియు ఎం ల్ హెచ్ పి ఆరిఫ్ హాజరైయిరి.శిక్షణా కార్యక్రమం లో ఏ.న్.ఎం లు, ఎం.ల్.హెచ్. పీ లు,ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు,