Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 18

తర్లుపాడు మండలం, జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాస్తవ్యులు, ప్రకాశం జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు 150 లాంగ్ నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. అలాగే కసెట్టి జగన్ 50 స్మాల్ నోటుబుక్స్, పెన్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా విద్యార్థులకు 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయమని కోరగా దానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి మూడు నోట్ బుక్స్ అవసరమని తెలియజేయగా కిరణ్ కుమార్ వెంటనే స్పందించి నేను ఇస్తానని ముందుకు వచ్చారు అని తెలియజేశారు. 4500 రూపాయల విలువ గల పుస్తకాలను దాత గంగిశెట్టి కిరణ్ కుమార్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ బాబు మాట్లాడుతూ నేను ఏ కార్యక్రమం తలపెట్టిన మా మిత్రులు నేను సైతం అంటూ ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకున్న దానిలో ఎంతో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయిని యం అనూష పాల్గొన్నారు. ఉచితంగా పుస్తకాలు అందించిన కిరణ్ కుమార్ ని, జగన్ ని గ్రామస్తులు అభినందించారు.