Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 నడిగూడెం

వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎంపీఓ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకిరాల, శ్రీరంగాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైప్ లైన్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సరఫరా లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల,పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష మిషన్ భగీరథ సిబ్బంది వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.