Listen to this article

జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా

బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలలో పాల్గొని ఈ ప్రాంతం కార్మికుల సమస్యల పైన చర్చించడం కొరకు వికారాబాద్ జిల్లాలో ని రాష్ట్ర నాయకురాలు వై గీత బయలుదేరి వెళుతున్నారు. ఈ సందర్భంగా వై గీత ( ఐ ఎఫ్ టి యు) భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ  2023 ఏప్రిల్ లో తిరుపతిలో గత జాతీయ మహాసభల లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసిన పద్ధతిని చర్చించి కొత్త  తీర్మానాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. గతంలో తిరుపతి కేంద్రంగా జరిగిన ఐ ఎఫ్ టి యు జాతీయ మహాసభల లో  కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి కార్మికుల పని భద్రత, కార్మిక చట్టాల అమలు కోసం ,వేతనాల పెంపుదల, అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ అంశాలలో పై పోరాటాలు చేసిన  విధానాన్ని  సమీక్షించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను రూపొందించడం కొరకు ఈ జనరల్ కౌన్సిల్ జరగబోతుంది గతంలో కొంతమేరకు విజయాలు సాధించిన ప్పటికి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన కోడ్స్ ను తీసుకురావడం వల్ల  కార్మికులు హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. దేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగా అవకాశాలు కల్పించడం లేదు. దేశంలోని నవరత్న, మినీరత్న, మహారత్న బిరుదులు పొందిన. ఈ దేశానికి లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చి పెట్టే పరిశ్రమలను బిజెపి ప్రభుత్వం కారు చౌకగా కార్పొరేట్ సంస్థలు ఆధాని, అంబానీ ల కు అమ్మడం కొరకు ప్రయత్నిస్తున్నారు. కోల్ ఇండియాలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను, బొగ్గు బ్లాక్ లను వేలం వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల లో 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కను మరుగు అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని కేహల్గమ్  లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ జరగబోతుంది. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణ చేయకుండా, కొత్త పరిశ్రమలను నెలకొల్పే విధంగా ఉద్యమాలు చేయడం, అదేవిధంగా బ్రిటిష్ కాలం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవడం కొరకు , రాష్ట్రంలో దేశంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని. ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ జాతీయ మహాసభల లో ఈ డిమాండ్స్ పైన తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు)  రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.