Listen to this article
  • కుంటి సాకులతో అడ్డుతగిలితే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదు..
  • ఎంజేఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాంబాబు..

జనం న్యూస్ నడిగూడెం, పిబ్రవరి 04ఈ నెల 7 న హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు-వేల గొంతుల కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరని మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ కోదాడ నియోజకవర్గం కోశాధికారి మందుల రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రం లో ఆయన విలేకరుల తో మాట్లాడుతూ… ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ అవార్డు గ్రహిత మంద కృష్ణన్న తలపెట్టిన లక్ష డప్పులు -వేల గొంతుల కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చూపిస్తూ పోలీస్ శాఖ నుండి అనుమతులు రాకుండా అడ్డుపడుతూ…ఈ కార్యక్రమం లో అసాంఘీక శక్తులు చేరి విధ్వంసం సృష్టించే అవకాశం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పోలీస్ అధికారులు చేత చెప్పించడం బాధాకరం అన్నారు.ఈ కార్యక్రమం ఎవరిపై యుద్ధం కాదని ఎస్సి వర్గీకరణ న్యాయబద్ధమైనదని,మాదిగ ల ఆకాంక్ష ను ప్రపంచానికి తెలియజేయడం కోసమే జరుగుతుందన్నారు.7 న జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడితే కాంగ్రెస్ ప్రభుత్వ కూల్చడానికి మాదిగలే ముందు నడుస్తారని ఆయన హెచ్చరించారు.