వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్
బిచ్కుంద డిసెంబర్ 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీ పరిధిలో గల గ్రామాలలోని రైతులతో యూరియా బుకింగ్ మొబైల్ యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యూరియా విషయంలో గత పంట కాలంలో జరిగిన సమస్యలను పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కొత్తగా యూరియా బుకింగ్ మొబైల్ యాప్ ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ మొబైల్ ఫోన్లలో ఇంటి నుండే వారికి నచ్చిన దుకాణాలలో యూరియా బుకింగ్ చేసుకుని ఆ దుకాణానికి లేదా సొసైటీకి వెళ్లి ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా యూరియా తీసుకొని వచ్చే అవకాశం కల్పించడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు
- రైతు ఇంటి వద్ద నుండే ఈ యాప్ ద్వారా తనకు దగ్గరలో ఉన్న దుకాణాలలో ఎంత మేరకు యూరియా నిలువలు ఉన్నాయో తెలుసుకోవచ్చు.
- రైతులు యూరియా కొరత ఉన్నదని అపోహలో భయాందోళనలో దుకాణాలకు వెళ్లి యూరియా కొనాల్సిన అవసరం లేదు
- పంట పండించిన నిజమైన రైతులు మాత్రమే తమకు నచ్చిన దుకాణానికి వెళ్లి యూరియా కొనుక్కునే వెసులుబాటు ఉంటుంది.
- యూరియా పంపిణీ రైతులు వేసిన పంటలను బట్టి సముచితంగా పారదర్శకంగా చేయబడుతుంది.
ఈ వివరాలన్నింటినీ రైతులకు తెలియజేయడం మరియు రైతులు వెల్లబుచ్చిన సందేహాలను కూలంకషంగా వారికి నివృత్తి చేయడం జరిగింది. ఈ సమావేశంలో పుల్కల్ గ్రామ నూతన సర్పంచ్ సంతోష్ పటేల్ ఉప సర్పంచ్ తుకారాం , సొసైటీ డైరెక్టర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు దయానంద్, లక్ష్మణ్, సొసైటీ సీఈఓ సాయి ప్రకాష్ మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.




