జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 19
మండలంలోని చెన్నారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముద్రించిన స్టడీ మెటీరియల్ చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాతలు శ్రీ సాధన డిగ్రీ కాలేజీ మరియు సాధన జూనియర్ కాలేజీ విద్యార్థుల సహాయముతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు మెటీరియల్ బాగా చదివి ఉన్నత స్థానాన్ని అధిరోహించి చదువు చెప్పిన గురువులను గౌరవించి ఊరికి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. ఆంగ్ల ఉపాధ్యాయులు పి. కోటి మోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం చాలా అభినందనీయమన్నారు. చదువులో వెనుకబడిన పిల్లలకు మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని అలాగే చదువులో రాణించే విద్యార్థులు మరింత ఎక్కువ మార్కులు సాధించేందుకు మెటీరియల్ లో వున్న మోడల్ పేపర్స్ దోహదపడతాయని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాగులూరి శ్రీకాంత్ ను ఘనంగా శాలువా తో సన్మానించడం జరిగింది.విద్యార్థులందరూ శ్రీకాంత్ వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి. కోటి మోహన్, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ బాబు,, కిషోర్ ,హేమలత, యోగ టీచర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు



