Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ను ప్రకటించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో జరిగిన “ప్రజా గర్జన” ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ నుండి పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విజయ వంతంగాకొనసాగింది.ఈప్రజాగర్జనకురాజంపేట ,రైల్వేకోడూరు,నియోజకవర్గాల్లోని ప్రజలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో పాల్గొని రాజంపేట జిల్లా కేంద్రం కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అన్ని అర్హతలు కలిగిన రాజంపేట జిల్లా కేంద్రం చేయాలన్నారు. ప్రతిఒక్కరికి అనుకూలంగా, భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రజాగర్జనలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా కేంద్రం రాజంపేట కావాలని ముక్త కంఠంతో నినదించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రం కోసం వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు ప్రత్యేకమైన ధన్య వాదాలు తెలుఫుతూ రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని అన్ని మండలాలప్రజలు,నాయకులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనడం చాలా సంతోషకరమని జిల్లా సాధించేవరకు మీ అందరి సహాయ సహకారాలు JAC కి ఇదేవిధంగా కొనసాగాలని ఆయనహితవు పలికారు.గర్జనఅనంతరం రాజంపేట టిడిపి అసెంబ్లీ ఇంచార్జ్, చమర్తిజగన్మోహనరాజు,పార్లమెంట్,సమన్వయకర్త అతికారి కృష్ణ, జనసేనపార్టీనాయకుడుయల్లటూరు,శ్రీనివాసరాజు, శ్రీశైలం దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు బిజెపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ తదితరులు, రాజంపేట ఆర్డిఓ కి వినతి పత్రం అందజేశారు,