(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20)
చేగుంట మండలంలోని సీ.ఎం.ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న సిరిమల్లె లలిత అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.5,000/- నగదు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొని మృతురాలి కుటుంబానికి సానుభూతి తెలిపారు.


