నూతనంగా నిర్మించిన చర్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయింది
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20
ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఐదు రోజుల ముందే ప్రారంభమైన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కీర్తనలు, బైబిల్ పఠనం, యేసు క్రీస్తు జన్మోత్సవ సందేశాలు భక్తులను ఆకట్టుకున్నాయి. చర్చి పాస్టర్ శాంతి, ప్రేమ, సోదరభావంతో జీవించాలని సందేశం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పిల్లలు, యువత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను మరింత సందడిగా మార్చారు. కార్యక్రమం చివర్లో కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం మీద ఎం ఆర్ హెచ్ ఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో హర్షాతిరేకాలతో కొనసాగుతున్నాయి.



