జనం న్యూస్ డిసెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన కొప్పుల రమేష్ పెద్దకర్మ కార్యక్రమంలో విలేకరులు మానవీయత చాటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నివాళులు అర్పించారు. ముగ్గురు విలేకరులు బాధిత కుటుంబానికి సహాయంగా ముందుకు వచ్చి 50 కేజీల బియ్యం అందజేశారు. వారు:కురుమెల్ల శంకర్ –జనం న్యూస్ రిపోర్టర్ దాసరి సాంబశివరావు – జర్నలిస్టు నర్సింగ్ గోజు విష్ణువర్ధన్ – ఆర్ స్టూడియో రిపోర్టర్ కుటుంబ సభ్యులు విలేకరుల సేవా భావాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని సానుభూతి తెలిపారు. వార్తలకే కాదు, సేవలకూ విలేకరులు ముందుంటారనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం.


