Listen to this article

స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 20

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మంగళకుంట గ్రామం లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర మరియు రైతన్న మీకోసం కార్యక్రమాలు మండల అధికారులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నంబుల లక్ష్మయ్య, గుమ్మా కాశయ్య పర్యవేక్షణ లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిహాజరయ్యారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.సాగును లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు వ్యవసాయ సూత్రాల గురించి,నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, గురించి రైతులకువివరించారు.ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు.మార్కాపురం జిల్లా ఏర్పాటు దశాబ్దాల నాటి మార్కాపురం ప్రజల కల అయిన ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంపై నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
జిల్లా ఏర్పాటుతోమార్కాపురం అభివృద్ధిపథంలోదూసుకుపోతుందని, కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.వచ్చే ఏడాదిలోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జ్యోష్ణ దేవి,ఏఓ బుర్రి చంద్రశేఖర్, ఈఓఆర్డీ రాఘవరవుపంచాయితీ సెక్రటరీ కాళంగి శ్రీనివాసులు,టిడిపి మండల అధ్యక్షులు చిన్నపరెడ్డి, మాజీ జడ్పిటిసి రావి బాషాపతి రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి పి గోపినాధ్, సీనియర్ నాయకులు కంచర్ల కాశయ్య,టిడిపి యువనాయకులు రావి కపిల్ రెడ్డి,మండలటీడీపీ నాయకులు ఈర్ల వెంకటయ్య,మేకల అచ్చిరెడ్డి, తనుబుద్ది రామకృష్ణ రెడ్డి,నంద్యాల కాశయ్య,కుందురు సత్యనారాయణ రెడ్డి, తంగిరాల అనిల్, గిడ్డాలు,మేకల వెంకట్, గౌతుకట్ల సుబ్బయ్య, బొంబాయి వలి,కందుల చిట్టీ బాబు, టి శ్రీను, వెన్నా వెంకటరెడ్డి, కాళంగి పెద్ద శ్రీను,షేక్ మహబూబ్, ఈర్ల పెద్ద కాశయ్య వలి,రాజారపుగురవయ్య,రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.