విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : సందీప్, శంకర్.
బిచ్కుంద, డిసెంబర్ 20 జనం న్యూస్
బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో బిచ్కుంద, జుక్కల్ మండలాల తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. బిచ్కుంద మండల తపస్ అధ్యక్షుడిగా ముత్యాల సందీప్, ప్రధాన కార్యదర్శిగా పేర్షెట్టి శంకర్ లను ఎన్నుకోగా, జుక్కల్ మండల తపస్ అధ్యక్షుడిగా జయచంద్, ప్రధాన కార్యదర్శిగా పత్తి సందీప్ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా తపస్ ఎన్నికల అధికారి యం. రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న ఉపాధ్యాయుల పెండింగ్ డీ ఏ లు, మెడికల్ బిల్లులు,, 317 బదిలీల ఆలస్యం, పదవీ విరమణ ప్రయోజనాల జాప్యం, పీఆర్సీ వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తపస్ ప్రధాన లక్ష్యమని, ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన నాయకులు సంఘాన్ని మరింత బలోపేతం చేసి, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, తపస్ నాయకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నూతనంగా ఎన్నికైన నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు రచ్చ శివకాంత్, హీరా, జనార్ధన్, సంజయ్, అనిల్ రెడ్డి, జయచంద్, సందీప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


