జనంన్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22
తర్లుపాడు దేవస్థానం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి పల్స్ పోలియో శిబిరంలో సామాజిక కార్యకర్త, ప్రధానోపాధ్యాయుడు కశ్శెట్టి. జగన్ బాబు పాల్గొని దాదాపు 52 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరి మరియు సర్పంచ్ పల్లె పోగు వరాలు మరియు ఏఎన్ఎంలు రాధాదేవి పుల్లమ్మ అంగన్వాడీ టీచర్స్ పద్మ లలిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన జగన్ ను అభినందించారు.



