జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైఎస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ , వైయస్సార్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులు పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మొదటగా పార్టీ ఆఫీసు దగ్గర కేకు కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు ఫలహారాలు పంచి పెట్టడం జరిగింది.రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన 150 మంది యువతకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు..ఈ కార్యక్రమంలో పార్టీ నాలుగు మండలాల మరియు టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పిటిసిలు,మరియు రాష్ట్ర వివిధ విభాగాల కార్యదర్శులు, అధికార ప్రతినిధులు మరియు జిల్లా వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు,అధికార ప్రతినిధులు మరియు నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు, మండల వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యదర్శులు, ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ కమిటీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు



