సర్పంచ్‌గా నునావత్ కుమారి, ఉపసర్పంచ్‌గా గుండు శీను బాధ్యతలు
రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే లక్ష్యం : సర్పంచ్
జనం న్యూస్ డిసెంబర్ 22 ( కొత్తగూడెం నియోజకవర్గం )
బాబు క్యాంప్ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నునావత్ కుమారి, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు అలియాస్ గుండు శీను, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నునావత్ కుమారి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా గ్రామ సంక్షేమం, అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గౌరవ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆశీస్సులతో పాటు, స్థానిక సీనియర్ కమ్యూనిస్టు నాయకులు దుర్గారాశి వెంకన్న, లక్ష్మీ గార్ల సహాయ సహకారాలతో బాబు క్యాంప్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సాధారణ గృహిణిగా ఉన్న తనను సర్పంచ్‌గా గెలిపించడాన్ని గ్రామ ప్రజల విజయంలో భాగంగా భావిస్తున్నానని తెలిపారు.అనంతరం ఉపసర్పంచ్ గుండు శీను మాట్లాడుతూ, గతంలో ఉపసర్పంచ్‌గా పొందిన అనుభవంతో గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. వార్డు సభ్యులు మురళీకృష్ణ, ఎలమందలి సదానందం, జోగా అమ్ములు మాట్లాడుతూ, రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, మురుగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సమిష్టిగా పనిచేస్తామని వెల్లడించారు.



