జనం న్యూస్ డిసెంబర్ 23 జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :
మండలంలోని వెల్లుల గ్రామంలో రాష్టంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా 296 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందగా ఈరోజు గ్రామంలో ప్రమాణ స్వీకారం చేసి సర్పంచ్ గా బాధ్యతలు తీసుకోవడం, ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి సభ్యునికి, తనని నమ్మి ఓటేసిన ప్రతి గ్రామ ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు, ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సగర్వంగా స్వీకరించి గ్రామ అభివృద్ధికి పాల్పడతానని, ప్రతి దినం గ్రామంలో అందుబాటులో ఉంటూ గ్రామంలోని ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా పనిచేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నారాయణ, ఎంపీడీవో, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు


