జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు లో విద్యార్థులకు అతిథి భోజనాన్ని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సోమవారం అరవపల్లి క్రీడా మైదానంలోని మండల ప్రాథమికపాఠశాలలో సర్పంచ్ జంబు సూర్య నారాయణ తల్లి తండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థినీ విద్యార్థులకు అతిథి భోజనాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన కలర్ రైస్ చికెన్ అరటిపండు స్వీట్ భోజనాన్ని అందించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు వరలక్ష్మి సుండుపల్లి వెంకటరమణ జంబు రవీంద్రబాబు జంబు సుదర్శన్ జంబు నవీన్ జైస్ రంజన్. పండు నాని ఉమాది శివకుమార్ శివనరసింహులు మారే శివ బాలాజీ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


