ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
జనం న్యూస్ 22డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్: జైనూర్ మండలం మానిగూడ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ జాదవ్ జానుబాయి గణపత్ నాయక్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఉపసర్పంచ్, పలువురు వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుగుణక్క హాజరై, శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని, గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. మానిగూడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నూతన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని ఆకాంక్షించారు.మానిగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ చేరికలతో పార్టీ మరింత బలపడిందని, రానున్న రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ముందుండి పోరాడుతుందని తెలిపారు.మండల అధ్యక్షుడు ముఖిద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


