జనం న్యూస్ డిసెంబర్(22) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా 95 సంవత్సరాల రామచంద్ర రెడ్డి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ సంతోషంతో కలిసిమెలిసి ఉండి పార్టీలకు అతీతంగా హాజరై రామచంద్రారెడ్డిని సన్మానించినారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్,మాజీ ఎంపీ బడుగు లింగయ్య,యాదవ్ గోరేటి వెంకన్న,బిజెపి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య తదితరులు హాజరైనారు.


