Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 22

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ సోమవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రేమ్ సింగ్ రాథోడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని, తండా ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమం అనంతరం గ్రామస్థులు మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.