సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 22
సాధించిన పట్లోళ్ల సతీష్ రెడ్డి సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రమాణం చేశారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ పట్లోళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ప్రజలందరినీ కలుపుకొని పారదర్శక పాలన అందిస్తానని, గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.



