Listen to this article

జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా22/12/2025 సోమవారం

అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరణ గ్రామ సర్పంచ్ బచ్చలి హరికృష్ణ, ఉప సర్పంచ్ గా కడాల శ్రీశైలం మరియు వార్డ్ మెంబర్ల చేత గ్రామ కార్యదర్శి రాములు ప్రమాణ స్వీకారం చేయించి శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి బచ్చలి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను చేరేలా కృషి చేస్తానని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శుభ్రత పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెడతానన్నారు, అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు, గ్రామంలో ప్రధాన సమస్యలు పై ప్రజలు అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ గా హామీ ఇచ్చారు.