Listen to this article

బీరు పూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ డిసెంబర్ 22 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని: గ్రామ పంచాయతీలో కొలువు తీరిన కొత్త పాలకవర్గం సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల విరామం తర్వాత గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గం ఏర్పడడంతో దీంతో గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. బీరు పూర్ మండల పరిధిలోని బీరు పూర్ నర్సిహుంలపల్లి కందనుకుంట తుంగూర్ కొల్వాయి కొమన్ పల్లి రేకులపల్లి తాళ్లధర్మరం చిత్రవేణిగుడెం కమ్మునూర్ మంగేళ గోండుగుడెం కండ్లపెల్లి చెర్లపెల్లి రంగు సాగర్ 16 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామాలలో నియమించిన ప్రత్యేక అధికారులచే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను అప్పగించారు.
గత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలు వాయిదా పడటం, సుమారు రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు కొత్త పాలకవర్గాల రాకతో ఆశలు చిగురించాయి.