బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ పక్కన మల్కాపూర్ గ్రామ శివారులో వెలసినటువంటి హనుమాన్ మందిర ఆలయ ప్రాంగణంలో అఖండ హరినామ సప్త రెండో రోజు కొనసాగింది. ఉదయం 10 గంటల నుండి గాతాభజన్, నాలుగు గంటల నుండి రామ కథ ,ఐదు గంటల నుండి హరి పాట్, రాత్రి తొమ్మిది గంటల నుండి హరి కీర్తన, తెల్లవారుజామున మూడు గంటల నుండి హరి జాగరణ ,ఉదయం నాలుగు గంటల నుండి కాకడ ఆర్తి కార్యక్రమాలు కొనసాగుతాయని అఖండ హరినామ సప్త నిర్వాహకులు తెలియజేసినారు .రోజు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుందని రాత్రి వేళలో హరి కీర్తన ఉంటుందని ప్రతి ఒక్క భక్తులు,భజన కారులో ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యమైన దేవుని ప్రవచనాలు విని సన్మానంలో నడవగలరని నిర్వాహకులు కోరుతున్నారు. మంగళవారం నాడు మధ్యాహ్నం నందు పటేల్ కీర్తనకారులకు భజన కారులకు, మాల్కారి సంప్రదాయం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసినారు. ఇట్టి కార్యక్రమానికి బిచ్కుంద ,గోపనపల్లి, చిన్న దేవాడ ,చిన్నదడిగి తదితర గ్రామస్తులు పెద్ద మొత్తంలో భక్తులు విచ్చేసి దేవుని అన్న ప్రసాదం స్వీకరించినారు.




