సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివి రేషన్ జనం న్యూస్ డిసెంబర్ 23
గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, ఆరోగ్య సేవల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా చూస్తానని, గ్రామంలో ఐక్యతతో శాంతియుత వాతావరణం కొనసాగించేలా అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. గ్రామస్తులు నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.


